తెలంగాణ
శ్రీకర ఆస్పత్రికి ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని శ్రీకర హాస్పటల్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచా వ్యాప్తంగా మన దేశానికి మంచి పేరు రావడమే కాకుండా విదేశీ మరకద్రవ్యం గాని ప్రపంచ ప్రజలకు సేవలు అందించడంలో గాని మన గొప్పతనం చాటుతూ అనేక కార్యక్రమాలు మెడికల్ టూరిజం ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టారని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకర ఆస్పత్రి యాజమాన్యం 24 సేవలు ప్రారంభిస్తుందని ప్రజలు ఆసుపత్రి సేవలు ఉపయోగించుకోవచ్చని ముందు ముందు మంచి పేరు తెచ్చుకోవడానికి మేము కృషి చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం వారి కుటుంబ సభ్యులు డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రికి రాష్ట్రమంత్రికి హర్యాన గవర్నర్కు ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు



