తెలంగాణముఖ్యాoశాలు

గాంధీ వారసులను ……..కాంగ్రెస్ .పార్టీని ఎవరు ఆపలేరు ఎమ్మెల్యే సీతక్క

బీజేపీ నేతలపై ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న
సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గాంధీ వారసులను గాడ్సే వారసులు ఇబ్బంది
పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులపైనే ఈడీ కన్ను ఉందన్నారు. ఈడీ బీజేపీ
అనుబంధ సంస్థలాగే కనిపిస్తోందని మండిపడ్డారు. దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల ఈడీ కళ్ళు
మూసుకుందన్నారు.బిజెపి టీఆర్ఎస్ ల పైన ఎమ్మెల్యే సీతక్క తనదైన శైలిలో మాట్లాడారు కాంగ్రెస్
ను ఎంతమంది వచ్చి ఎన్ని చేసినా ఆ పార్టీని ఎవరు ఆపలేరని అపనిందలు వేసే వారికి త్వరలోనే
బుద్ధి చెప్తామని ఆమె చెప్పకు వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఇండియాను దోచుకుంటున్నట్టు ఇప్పుడు కొందరు
దోచుకుంటున్నారని తెలిపారు. ప్రతి వస్తువుపై గబ్బర్ సింగ్ టాక్స్ వేస్తున్నారని వ్యాఖ్యానించారు.
బీజేపీ దాని తోత్తు టీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker