తెలంగాణముఖ్యాoశాలు
వానలు వచ్చినా వరదలు వచ్చినా డబ్బులు కట్టాల్సిందే

పోలీస్ అంటే నిర్విరామంగా పనిచేసే ఒక యంత్రంలాగా పనిచేస్తూ ప్రజలకు హాని కలగకుండా ఎవ్వరూ హాని చేయకుండా వారి ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతూ వారు కొవ్వొత్తిలా వెలుగులుస్తూ కరిగిపోతూ ఉంటారు అయితే శుక్రవారం సాయంత్రం మియాపూర్ చౌరస్తాలో జోరు వానలో గొడుగులు వేసుకొని వచ్చే పోయే బళ్లను ఆపి ట్రాఫిక్ పోలీసులు చలానాలు వసూలు చేస్తున్నారు వాన కురుస్తుంది కదా అని రెస్ట్ తీసుకుందామంటే కుదరదు వానైనా వరదైన ఎండొచ్చినా ఎప్పుడైనా మా డ్యూటీ మేము చేస్తాం అని ఇద్దరు కానిస్టేబుళ్లు వాళ్ల డ్యూటీని వానలో బైక్ పై వెళుతున్న వారిని సైతం వదిలిపెట్టకుండా చలానాలు వసూలు చేస్తున్నారు ఇది తప్పు కాదు ఇది కేవలం డ్యూటీ ఈ డ్యూటీ ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు వాన కురుస్తున్న సమయంలో వాహనదారుడు తడుస్తూ కూడా వెళుతున్నాడంటే అది ఎంత అర్జెంటుగా వెళ్లాల్సిన పని అయ్యుండొచ్చు. ఆ బండి ఆపకపోయినా ఎప్పుడైనా దొరకవచ్చు కానీ వానలో ఆపి రక్షించాల్సిన పోలీసులే శిక్ష వేసినట్టుగా వానలో ఆపి వసూలు చేయడం తప్ప కాదా అంటే తప్పు కాదని చెప్పొచ్చు కానీ ఆరోగ్యం దృశ్య ఇది తప్పే ముమ్మాటికి అవతల వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అనేది చూడకుండా వానలో సైతం ఆపడం తప్పే అవుతుంది గొడుగులు వేసుకొని వానలో పోయే వాహనాలను ఆపుతూ వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది వారిని ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం మరోలా ఉంది మాకు రోజువారి టార్గెట్లు ఉన్నాయి ఆ టార్గెట్ల కోసమే మేము తప్పనిసరిగా వానలోనైనా ఎండలోనైనా ఏ సమయంలోనైనా మేము చేయాల్సిన పని మా డ్యూటీ చేయాల్సిందే పై అధికారులకు సమాధానం చెప్పుకోలేము కాబట్టి డ్యూటీ చేసి వారికి చెప్పాల్సిన సమాధానం టార్గెట్ల రూపంలో వారికి చేయాలి అందుకనే ఈ శ్రమ అని వారు చెప్పడం విశేషం




