రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు ఘన నివాళులు
చేగుంట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన చేగుంట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు ఘన నివాళులు
చేగుంట నవంబర్ 26 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన చేగుంట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు, ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.


