అనంతసాగర్ కు వరం – ఉప సర్పంచ్ ల సేవా కృషి

అనంతసాగర్ కు వరం – ఉప సర్పంచ్ ల సేవా కృషి
చేగుంట నవంబర్ 25 ప్రయత్నం న్యూస్
చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తున్న చేగుంట మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు *మహమ్మద్ రఫీ గొప్ప సహకారంతో, అనంతసాగర్ పాలక మండలి కృషితో అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో బోరుబావిని వేయించడం జరిగింది.
పాఠశాల విద్యార్థులకు తాగునీటి ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి సంకల్పంతో, అనంతసాగర్ సర్పంచ్ శ్రీధర్ ఉప సర్పంచ్ చిక్కుడు స్వామి గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి అంకితభావానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతసాగర్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి నాయకుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ చేస్తూ రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో నిలవాలని భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు సర్పంచ్ శ్రీధర్. ఉప సర్పంచ్ స్వామి మాట్లాడుతూ ఇలాంటి నాయకుడు మా ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అయినందుకు మాకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు మరియు రాబోయే రోజుల్లో మా నాయకుడు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మా పూర్తి సహకారం అందిస్తామని అనంతసాగర్ గ్రామ ప్రజల తరఫున హామీ చేశారు
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేశం, గారి సిద్ధి రాములు, వెంకటేశం గారి సిద్ధిరాములు శాలిపేట రేకా రమేష్, సడక్ పాషా, పిల్లి దుర్గయ్య, కంబాల నరసమ్మ, సత్యనారాయణ, బెదిరమైన స్వామి, గుడ్డబోయిన నాగభూషణం, రామస్వామి భాస్కర్ బోయిని రాజు, మేకల యాదగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు.




