వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్

“వివాహ బంధం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే పవిత్రమైన అనుబంధం” – ఈర్ల రాజు ముదిరాజ్
ప్రయత్నం న్యూస్… సంగారెడ్డి
పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలోని కిష్టారెడ్డిపేటకు చెందిన మా ఆత్మీయ మిత్రుడు మాణిక్యం గారి అన్న కుమార్తె వివాహ వేడుకలో బీరంగూడ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ పాల్గొని నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులకు నూతన వస్త్రాలను అందజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో
, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు మాట్లాడుతూ.. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదని, రెండు కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెంపొందించే పవిత్రమైన బంధమని, పరస్పర నమ్మకం, గౌరవం, ప్రేమతో నూతన వధూవరులు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ..* వివాహ బంధం జీవితంలో ఎంతో విలువైనదని, భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలుస్తూ, కుటుంబ పెద్దల ఆశీస్సులతో, ప్రేమాభిమానాలతో జీవితంలో ముందుకు సాగాలని అన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు ఆనందమయంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాపరెడ్డి గారు, జిన్నారం సీనియర్ నాయకులు సుధాకర్ గారు, మా మిత్రుడు మాణిక్యం. కొడకంచి యాదయ్య ముదిరాజ్. పలువురు నాయకులు, మిత్రులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
“డబ్బుతో కొనలేనిది ఆప్యాయత.. కాలంతో చెరిగిపోనిది మంచి బంధం.. జీవితాంతం తోడుండేది నిజమైన అనుబంధం.”


