All

​ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా జర్నలిస్టులు కీలక సేవలు

*​తమ హక్కుల కోసం తెగించి పోరాడుతాం. *​మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఇళ్ల స్థలాల సమస్యను తీసుకెళ్తాం ​టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి

​ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా జర్నలిస్టులు
కీలక సేవలు
*​తమ హక్కుల కోసం తెగించి పోరాడుతాం.
*​మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఇళ్ల స్థలాల సమస్యను తీసుకెళ్తాం
​టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి

​రేగోడ్ … ప్రయత్నం న్యూస్

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టులు ఎంతో కీలకమైన సేవలందిస్తున్నారని టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి అన్నారు. రేగోడ్ లో జరిగిన జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
​సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై యూనియన్ తరపున తెగించి పోరాడుతామని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా రేగోడ్,అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మరియు యూనియన్ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఒకవేళ స్పందన లేకపోతే ఇళ్ల స్థలాల సాధనకు న్యాయపరమైన పోరాటాలు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
​తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కొమ్ముకాయదని, అందరినీ సమానంగా చూస్తూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అనంతరం జర్నలిస్టుల సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఆనంద్, రాజు, మండల ప్రెస్ క్లబ్ ప్రతినిది శంకర్ గౌడ్ స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker