భీమ్రావుపల్లి గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
నార్సింగి మండలం, బీమ్రావుపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సర్పంచ్ కిష్ట జనార్దన్

భీమ్రావుపల్లి గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
చేగుంట నవంబర్ 25 ప్రయత్నం న్యూస్
నార్సింగి మండలం, బీమ్రావుపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సర్పంచ్ కిష్ట జనార్దన్ గారి ఆధ్వర్యంలో, మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు సమస్యలు, హెర్నియా, గడ్డలు, కణతులు, థైరాయిడ్ గడ్డలు, గర్భాశయ సంబంధిత సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు మరియు ఊపిరితిత్తుల సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ వైద్య శిబిరంలో మొత్తం 103 మంది OP సేవలు పొందగా, 30 మంది IP సేవలు పొందడం జరిగింది.
ఆపరేషన్లు మరియు తదుపరి వైద్య పరీక్షలు అవసరమైన వారికి మెడిసిటీ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు మరియు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
1. డాక్టర్ వైభవ్
2. డాక్టర్ టీనా
3. డాక్టర్ స్వాతి
4. డాక్టర్ రేష్మా
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ కిష్ట జనార్దన్ గారితో పాటు మాజీ వార్డ్ నెంబర్ బోయిని భూషణం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



