All

రాంపూర్ గొల్లపల్లి సోమ్లా తండాలో ప్రత్యేక గ్రామసభ

చేగుంట మండలంలో ని రాంపూర్, గొల్లపల్లి మరియు సోమల తాండా గ్రామాలలో ఎల్ నినో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ఎంపీడీవో చిన్నారెడ్డి, తహశీల్దార్ బాల లక్ష్మి, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌, మిషన్ భగీరథ ఎ ఈ ఈ దివ్యశ్రీ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు,ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.

రాంపూర్ గొల్లపల్లి సోమ్లా తండాలో ప్రత్యేక గ్రామసభ

చేగుంట నవంబర్ 26 ప్రయత్నం న్యూస్

చేగుంట మండలంలో ని రాంపూర్, గొల్లపల్లి మరియు సోమల తాండా గ్రామాలలో ఎల్ నినో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ఎంపీడీవో చిన్నారెడ్డి, తహశీల్దార్ బాల లక్ష్మి, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌, మిషన్ భగీరథ ఎ ఈ ఈ దివ్యశ్రీ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు,ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి సమస్యలు, తాగునీటి కొరతపై ప్రజలకు వివరించారు. నీటి వృథాను అరికట్టి, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డుల ప్రాధాన్యత, వాటి వినియోగం గురించి వివరించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు.ఈ గ్రామసభలో వివిధ శాఖల అధికారులు ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, గ్రామాల అభివృద్ధి, నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker