పట్టభద్రుల ఓటరు నమోదుకు మరో అవకాశం
*బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు

పట్టభద్రుల ఓటరు నమోదుకు మరో అవకాశం
*అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
ముసాయిదా జాబితాలో పేర్లు సరిచూసుకోండి
*బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు
మణుగూరు, నవంబర్ 25, ప్రయత్నం న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదుకు మరో అవకాశం లభించిందని, గతంలో నమోదు చేసుకోలేకపోయిన అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. అర్హులైన ప్రతి పట్టభద్రుడికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించారని, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 10 లోపు అభ్యంతరాలకు అవకాశం
ఇప్పటికే విడుదలైన పట్టభద్రుల ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని రేగా కోరారు. జాబితాలో పేర్లు లేకపోయినా, వివరాలలో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉన్నా డిసెంబర్ 10వ తేదీలోపు సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేసుకోవాలని సూచించారు.
పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని రేగా కాంతారావు ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డులో పట్టభద్రులను గుర్తించి, వారందరూ ఓటర్లుగా నమోదయ్యేలా కృషి చేయాలన్నారు. ముసాయిదా జాబితా పరిశీలన, అభ్యంతరాల స్వీకరణపై అవగాహన కల్పిస్తూ, జిల్లాలో అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.