All

ఒక్కటి కొడితే అన్ని సెట్…..

జైళ్ల శాఖ ఇక..... సెట్

ఒక్కటి కొడితే అన్ని సెట్…..
జైళ్ల శాఖ ఇక….. సెట్

హైదరాబాద్ ప్రయయినట్టేత్నం న్యూస్

ముఖ్యమంత్రి తలచుకుంటే ఏదైనా సెట్ కావాల్సిందే అన్న పదం కేవలం తమిళనాడు సీఎం విజయ్ కే చెందుతుంది ఏ పని చేసినా ఆ పనిలో ఒక స్పెషల్ ఆయన పనితీరు ప్రస్తుతం జైల్లో శాఖ పని పట్టేసినట్టే తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్‌ జైలు నుంచి సినీఫక్కీలో 17మంది ఖైదీలు పారిపోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. జైళ్ల శాఖలో భారీగా బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. భద్రతా లోపాలకు కారణమైన ఇతర అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అక్టోబరు 26న రాత్రి జైలు సిబ్బందిపై దాడి చేసి.. 17 మంది ఖైదీలు తప్పించుకున్న సంగతి తెలిసిందే దీంతో పోలీసులు 20కి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పారిపోయిన వారందరినీ పట్టుకున్నారు. ప్రస్తుతం వారందరినీ రాష్ట్రంలోని అత్యంత భద్రత కలిగిన కేంద్ర కారాగారాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker