All
కంకిపాడుమండలంలోని ఈడుపుగల్లు-2 ఎంపీటీసీ అభ్యర్థి హిమబిందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
గుండెనొప్పి వచ్చిం ఈడుపుగల్లు-2 ఎంపీటీసీ అభ్యర్థి హిమబిందు
2 సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిని హిమబిందు–వైకాపా ఈడుపుగల్లు –
కంకిపాడుమండలంలోని ఈడుపుగల్లు-2 ఎంపీటీసీ అభ్యర్థి హిమబిందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం గ్రామంలోని తన నివాసంలో మాట్లాడుతూ… కొన్నేళ్లుగా గుండె సంబంధిత చికిత్స జరుగుతోందన్నారు. ఇటీవల వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేయాలని పార్టీ నాయకులు కోరడంతో నామినేషన్ దాఖలు చేశారన్నారు. అయితే ప్రచారానికి వెళ్తున్న క్రమంలో శుక్రవారం మరోసారి గుండెనొప్పి వచ్చిందని.. దీంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారన్నా
రు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలిపారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు, క్షమాపణలు తెలిపారు.



