All
నార్సింగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన

నార్సింగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన
చేగుంట నవంబర్ 26 ప్రయత్నం
న్యూస్
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు జడ్.పి.హెచ్.ఎస్ నార్సింగిలో విద్యార్థులకు భారత రాజ్యాంగం పై అవగాహన కల్పించడానికి వ్యాసరచన డ్రాయింగ్ కాంపిటీషన్ మొదలగు కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రాజ్యాంగం యొక్క ఆశయాలు లక్ష్యాలు రాజ్యాంగ పీఠిక ప్రభుత్వ ఏర్పాటు పౌరుల ప్రాథమిక విధులు హక్కులు మొదలైన అంశాల పైన అవగాహన కల్పించడం జరిగినది మరియు రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి చందర్ కార్యక్రమానిర్వాహకులు రమేష్ భాస్కర్ స్వామి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది


