All
భారత రాజ్యాంగ పీఠిక – ప్రజాస్వామ్యానికి పునాది
భారత రాజ్యాంగ పీఠిక – ప్రజాస్వామ్యానికి పునాదికోహిర్ ప్రయత్నం న్యూస్
భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం కల్పించే మహోన్నతమైన పత్రం. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని (సంవిధాన్ దివస్) జరుపుకుంటాం.
రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన మరియు భావప్రకటన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలను ప్రతి పౌరుడు గౌరవించాలి.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటం ప్రతి భారతీయుడి బాధ్యత.



