తెలంగాణముఖ్యాoశాలు
అమిత్ షా మునుగోడు పర్యటన వివరాలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజీపీ నాయకులు ఈ నెల 21న మునుగోలులో పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.40 గంలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4.15గంలకు మునుగోడుకు చేరుకుంటారు. 4.40 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మునుగోడు సభలో పాల్గొంటారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. తిరిగి అమిత్ షా మునుగోడు నుంచి హెలికాప్టర్‌లో 6.25గంలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని 6.30 గంలకు ఢిల్లీకి పయనమవుతారు. మునుగోడు ఉప ఎన్నిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.




