తెలంగాణముఖ్యాoశాలు

మిస్సింగ్ కేసుల భరతం పడుతున్న జిల్లా ఎస్పీ కోటి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ.N. కోటిరెడ్డి IPS  జిల్లాలో జరుగుతున్న మిస్సింగ్ కేసులపై మరియు వాటి పురోగతి గురించి పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.వికారాబాద్ జిల్లాలోని 2020 నుండి ప్రతీ సంవత్సరం నమోదైన మిస్సింగ్ కేసులు అందులో ఛేదించిన కేసుల గురించి వివరించడం జరిగింది. 2020 సంవత్సరంలో 208 కేసులు నమోదు అయ్యాయి అందులో 206 కేసులను చేదించడం జరిగింది,మిగితా 02 కేసులు UI (Under Investigation) లో ఉన్నాయి. అదేవిధంగా 2021 సంవత్సరంలో 277 కేసులు నమోదు అయ్యాయి అందులో 263 కేసులు చేదించడం జరిగింది, 14 కేసులు UI (Under Investigation) లో ఉన్నాయి.ప్రస్తుత సంవత్సరంలో ( 2022 ) 179 కేసులు నమోదు కాగా 158 కేసులు చేదించడం జరిగింది. మిగితా 21 కేసులు UI (Under Investigation) లో ఉన్నాయి. ఈ విధంగా జిల్లా లోని పోలీస్ వ్యవస్థ, జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ప్రత్యేక శ్రద్ధతో పని చేసి జిల్లాలో నమోదవుతున్న కేసులను చేదించడంలో పురోగతిని సాదిస్తుంది అని తెలిపారు. జిల్లాలోని IT Cell కూడా ఇట్టి కేసులను చేదించడంలో తమ పాత్ర పోసిస్తుంది. ఇట్టి విషయంలో అందరినీ జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. మరియు జిల్లాలో ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడే విధంగా చేస్తామని జిల్లా ఎస్‌పి గారు అన్నారు, కావున ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. శ్రీ.N. కోటి రెడ్డి ఐపీఎస్ గారు వికారాబాద్ జిల్లాకు ఎస్పీ గా భాద్యతలు చేపట్టినప్పటి నుంచి నేటివరకు 207 కేసులు నమోదు అయినవి అందులో 204 కేసులను చేదించడం జరిగింది. ఇంకా జిల్లాలో 2020 నుండి 2022 జులై నెల వరకు 37 కేసులు మాత్రమే UI (Under Investigation) లో ఉన్నాయి, వాటిని కూడా విచారణ వేగవంతం చేసి తొందర్లో వాటిని కూడా చేదించాలని జిల్లా ఎస్పీ గారు జిల్లా అధికారులకు ఆదేశించడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఎటువంటి నేరాలు జరగకుండా ప్రశాంతముగా ఉండే విధముగా జిల్లా ప్రజలు సహకరించాలని నేర రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. అదే విధాముగా నేరాలకు పాల్పడే నేరగాళ్లకు జిల్లాలో ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని లేని యెడల తన ఆధ్వర్యములో పని చేస్తున్న ప్రత్యేక బృందం దృష్టి నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker