తెలంగాణ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు…..14 రోజుల పాటు రిమాండ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియా లో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్‌కు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. రాజాసింగ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది. సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం చెలరేగింది.రాజాసింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి తరలించారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు లో హాజరుపర్చనున్నారు. మంగళ్‌హట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. 153(ఏ), 295-(ఏ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ తమ సస్పెన్షన్‌ను ముందే ఊహించారు. శనివారం మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుని తీరుతామన్న రాజాసింగ్ ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడనని . తన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మలా తనను కూడా సస్పెండ్ చేయొచ్చునని అన్నారు. తనను సస్పెండ్ చేసినా ప్రధాని మోదీ, అమిత్‌షాలకు ఫాలోవర్‌గా ఉంటానన్నారు. పార్టీ కంటే.. ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తాయని రాజాసింగ్ ముందే చెప్పారు.


