తెలంగాణ

సాహితి వ్యవహారంలో ఏపీ మంత్రులు ఎంపీలు…తెలంగాణలో ఇద్దరు మంత్రులు

సాహితి వ్యవహారంలో  ఏపీ మంత్రులు ఎంపీలు.....
 తెలంగాణలో  ఇద్దరు మంత్రులు లక్ష్మి నారాయణ కు అండ....
సాహితీ ఎండి లక్ష్మీనారాయణ తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కావాల్సిన పరిస్థితి
సిటీ క్రైమ్  మేజర్ న్యూస్
పెద్దల అండతోనే సాహితీ 2000 బాధితులకు నష్టం చేకూర్చింది దీని వెనుక పెద్దల హస్తం ఉంది వారు ఎంత పెద్ద వారైనా న్యాయానికి చట్టానికి అతీతులేం కాదు కేసులు బుక్ అయిన తర్వాత సిసిఎస్ పోలీసులు విచారణ సాగిస్తున్నారు ఈ విచారణ సాహితీ ఎండి లక్ష్మీనారాయణ తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది 2017 జూలై 29వ తేదీన సాహితీ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఓసి నుండి కంపెనీని ఏర్పాటు చేసి దాంట్లో కొడుకు సాత్విక్ మరియు పార్వతి  లక్ష్మీనారాయణలు  డైరెక్టర్లుగా ఉండడం జరిగింది ఆ సమయంలో ఈ కుటుంబ సభ్యుల ఆస్తులు వాటి వివరాలన్నీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ రూపంలో చేయబడ్డాయి అంతేకాకుండా కుటుంబమంతా ఒకే కంపెనీని ప్రారంభించి ఆ కంపెనీతో ప్రజలను ముంచి ప్రస్తుతం పోలీసుల దగ్గర నిందితులుగా నుంచోవడం జరిగిందని బాధితులు చెప్తున్నారు. ఎంతో తెలివిగా చాకచక్యంగా ప్రజలను మోసం చేశానని అనుకుంటున్నా లక్ష్మీనారాయణ 2019లో తనతో కలిసి వ్యాపారం చేసిన మరి కొన్ని కంపెనీల వారిని కూడా ముంచినట్టే ఇది తెలియక తప్పించుకున్నామని తెలివిగలవారమని అనుకుంటున్నారు   మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే చట్టం ఎవరికీ చుట్టం కాదు అధికారంలో ఉన్నప్పుడు మాట విన్నారు కదా అని ఎప్పుడూ మాట వింటారు అనుకోవడం తెలివి తక్కువతనం తెలంగాణలోనూ ఏపీలోనూ తన వ్యాపారాలు సాగించాలని ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చానని పోలీసులకు డబ్బులు ఇచ్చారని ఎవరు నన్ను ఏమీ చేయలేరని చెప్పుకుంటే బాధితులు భయపడతారా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆఫీసులో పనిచేసే ప్యూన్ సైతం ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లే దారులు ఎన్నో ఉన్నాయి రెండు వేల మందిని మోసం చేశాను నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకోవడం తనను తాను మోసం చేసుకోవడమే ఎంతో కష్టపడి చెమటోడ్చి అప్పులు తెచ్చి తాకట్టు పెట్టి సొమ్ము కూడా పెట్టి నీకు తెచ్చిస్తే ఇండ్లు నిర్మించకుండా స్థలం లేకుండా అందర్నీ మోసం చేయడం ఎంత దారుణం దీని వెనక ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటూ తన దగ్గరికి వచ్చిన బాధితులను లక్ష్మీనారాయణ బెదిరించారని బాధితులు వాపోతున్నారు కనీసం మర్యాద కూడా లేకుండా ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని గతంలో బాధితులు ఆపోయారు రోజుకు ఒకరు చొప్పున ఎవరో ఒకరు ఆఫీసులో ఉండి వచ్చిన వారికి సమాధానం కూడా చెప్పకుండా ఉండిపోవడం దీంతో విసుగెత్తి సిసిఎస్ పోలీసులు ఆశ్రయించామని బాధితులు చెప్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker