తెలంగాణ

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష

.

94% శాతం హాజరు శాతం నమోదు
జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష నేడు ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరిగింది.

పటిష్టమైన బందోబస్తు మధ్య జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలు. జిల్లాకు కేటాయించబడిన అభ్యర్థులు 10014, పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 9421, గైరాజరైన అభ్యర్థులు 593. పర్సంటేజ్ 94%.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించిన జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీ పి.జి రెడ్డి, నోడల్ ఆఫీసర్ అదనపు ఎస్పీ శ్రీ రాంరెడ్డి రెడ్డి, చీప్ సూపర్డెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్ అధికారులు, సిబ్బంది, మరియు పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ రమేష్, సీఐలు శ్రీనివాస్, కుమారస్వామి, వెంకటేష్, మహేందర్, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రవి కుమార్,వివిధ కళా శాలల ప్రిన్సిపల్స్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker