తెలంగాణ
కాళేశ్వరం నీళ్లతో ప్రయోజనం ఉందా………కేసీఆర్‌పై పొన్నాల విమర్శ

సీఎం కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుభవరాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్
అంటూ మండిపడ్డారు. ప్రాజెక్టులు కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్లు పండించాయని ఆరోపించారు.
కాళేశ్వరం నీళ్లతో ప్రయోజనం ఉందని నిరుపిస్తారా?ప్రయోజనం లేని పనులు చేసి ప్రజల మనసులను
గెలవగలవా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నాళ్లు ఇలా అని పొన్నాల ప్రశ్నించారు. చరిత్రలో
నిరుపయోగమైన ప్రాజెక్టు కట్టిన చరిత్ర కేసీఆర్దేనని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్లో 50 టీఎంసీలు
నింపే దమ్ము కేసీఆర్కి ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నీటి కోసం పోరాటం చేసిన చరిత్ర
కాంగ్రెస్దేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులకు, టీఆర్ఎస్ ప్రాజెక్టులకు ఎంతో తేడా ఉందని
పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.




