
మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ పై అభిరామ్ ఎం. దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెల హీరోగా రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ మువీ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, లక్కి కథానాయికలుగా నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి నటుడు పృద్విరాజ్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది…
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ… ఈ కథలో పాత్రలు కల్పితం తన మొదటి సినిమా అయినా మా హీరో పవన్ తేజ్ కొణిదెల అనుభవం ఉన్న నటుడిగా బాగా చేసాడు. ఈ మూవీలో సీనియర్ నటుడు పృద్వి రాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. పోలీస్ అధికారిగా ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని, త్వరలో చిత్ర నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారాయన.



