Allసినిమాలు

న‌న్ను ఆపితే ఆగే ర‌కాన్నికాదు…! వర్మ

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై   సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అందిస్తున్న తాజా  చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం  ఈ నెల 29న విడుదల కావాల్సింది కాగా  సెన్సార్  కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ గా మార్చారు. ఈ సందర్భముగా  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు  చేసిన విలేకరుల సమావేశంలో…

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – ” అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో ఏ కులాన్ని కానీ, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం తరువాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను. నేను ఎవరినీ టార్గెట్‌ చేసి సినిమా కాదు కేవలం నాకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కించాను. మామూలు క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది అందుకనే ఈ మధ్య ఆ తరహా సినిమాలు నన్ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ముందు ఒక లైన్ వస్తుంది ‘మే 2019 నుండి సెప్టెంబర్ 2020 వరకూ జరిగిన ఘటనల ఆధారంగా’ అని. జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా జరగబోయే అంశాలను ఊహించి చెప్పడం జరిగింది. సెన్సార్ రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదని, కానీ, అన్ని రూల్స్‌ను నా  సినిమా మీదే ప్రయోగిస్తున్నారు ఎందుకో నాకు అర్ధం కావడం లేదు.

 ఓటు వేసి మనకు కావలసిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమాను చూడాలి.. దేనిని చూడకూడదనేది తెలియదా? అది ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్ళు చూసి చెప్పాలా.. యు ట్యూబ్ లో సెటైర్ వీడియోలు వందల్లో ఉన్నాయి. నాకు ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. ఒక సినిమా ట్రైలర్ చూసి ఆడియన్ సినిమా చూడాలి అని ఫిక్స్ అయితే విడుదల లేట్ అయినా తప్పక చూస్తారు. ‘నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే  మా ప్రొడక్షన్ నుండి బ్యూటిఫుల్ అనే లవ్ స్టోరీ వస్తుంది” అన్నారు.

Attachments area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker