Allసినిమాలు

సరిలేరు సూపర్ స్టార్ నీకెవ్వరు

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోష్ లో ఉన్నారు. వరుస హిట్‎లతో దూసుకుపోతున్నారు. సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ  వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ సూపర్ స్టార్. సరిలేరు..విజయం తర్వాత మహేష్ షూటింగ్ కి దూరంగా ఉన్నారు. తన ఫ్యామిలీతో టైమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ బాబు. అయితే.. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు తరువాత సినిమా తనకు ‘మహర్షి’ వంటి మంచి విజయం అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్లు, దిల్ రాజు నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే,.. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా అమెరికాలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. హాలీడేస్‌ను పూర్తి చేసుకుని ఇంకో నెలలో ఈ సినిమా పట్టాలెక్కనుందని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేనట్టే ఉంది. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్. అందుకే ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరక్కుండా జాగ్రత్త పడుతున్నాడు. 

ఇప్పుడు వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో మహేష్‌ బాబుకు కొన్ని అనుమానాలు ఉండటంతో దర్శకుడు వంశీ వాటిని తీర్చే పనిలో బిజీగా ఉన్నాడనే వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి. దానికితోడు కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించడాని అంటున్నారు. దానికి మరిన్ని రోజులు సమయం పడుతుందని ప్రచారం విపరీతంగా సాగుతుంది. సూపర్ స్టార్ కు మహేష్ ఇమేజ్‌కు సరిపోయేలా ఈ కథ సిద్ధం చేయడానికి దర్శకుడు వంశీ పైడిపల్లికి చాలా సమయమే పడుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే అన్నట్లు గుసగుసలు వినపడుతన్నాయి.

దీంతో తాజాగా వస్తోన్న సమాచారం మేరకు సూపర్ స్టార్ మహేష్ మరో దర్శకుడి సినిమాకు సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో డైరెక్టర్ తో తదుపరి సినిమా చేయనున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా మహేష్ తన 27వ సినిమాను ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ అందించిన పరుశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని ఫిల్మ్ నగర్ వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా మార్చిలోనే ప్రారంభం కానుట్లు వార్తలు వినిపినిస్తున్నాయి. సినిమాను త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాదిలోనే విడుదల చేయాలనీ చూస్తున్నారట దర్శక నిర్మాతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker