సినిమాలు

ఊర్వశివో రాక్షసివో సినిమా మా కుటుంబానికి ఒక స్వీట్ మెమొరీ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ చిత్రానికి విజేత సినిమా ఫేమ్ రాకేష్‌ శశి దర్శకత్వం వహించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ-2 పిక్చర్స్‌ పతాకంపై ధీరజ్‌ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఊర్వశివో రాక్షసివో’ నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అందులో భాగంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. సక్సెస్ మీట్ కి ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.

చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ….
బన్నీ సార్ ఈ ఈవెంట్ కి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా నాకు సపోర్టివ్ గా ఉన్న మా కుటుంబ సభ్యులకి థాంక్యూ సో మచ్. బన్నీ సర్ మీరు గంగోత్రి సినిమాతో మొదలుపెట్టి ఇప్పుడు పుష్ప సినిమాతో ప్రపంచం మొత్తం మీ వైపు చూసేలా సాగింది మీ జర్నీ.మీకు చాలామంది అభిమానులు ఉన్నారు , ఆర్మీ ఉంది. మాకు మీరంటే గౌరవం సర్. ఈ సినిమా విజయాన్ని శిరీష్ ఫ్యాన్స్ కి అంకితం చేస్తున్నాను. ఈ సినిమాలో శిరీష్ గారి క్యారెక్టర్ కి, నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన చాలా నేచురల్ గా నటించారు అంటే, అది ఆయన పెట్టిన ఎఫర్ట్. అలానే మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ సో మచ్. మా సినిమా వెనకుండి బ్యాక్ బోన్ లా నడిపించిన వ్యక్తి బన్నీ వాసు గారికి థాంక్స్ అనే మాట చిన్నది. అల్లు అరవింద్ గారు నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. చాలామంది నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి హడావిడిగా షూటింగ్ చేసేయండి అంటారు. కానీ అరవింద్ గారు సినిమా నాకు నచ్చాలి, అందరికి నచ్చాలి అని చెబుతారు అంటూ,ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..
ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి థాంక్స్ చెబుతూ, బన్నీ వాసు గారు ఈ సినిమా కోసం ముందు నన్ను అప్రోచ్ అయ్యి కన్విన్స్ చేసారు. ఈ సినిమాను అర్ధం చేసుకున్న ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…
ముందుగా మా బన్నీ ఫ్యాన్స్ కి, మా ఆర్మీకి థాంక్యూ సో మచ్.
మా ఫంక్షన్స్ అన్నింటికీ దిల్ రాజు గారు ఇంట్లో మనిషిలా హాజరవుతారు . థాంక్యూ సో మచ్ అన్న. ఈ జీఏ 2 పిక్చర్స్ యంగ్ స్టార్స్ , యంగ్ టాలెంట్ కి ఒక ప్లాట్ఫ్రామ్ ఉండాలి అనుకున్నాం.
ఈ సంస్థలో 60 ఏళ్ళ కుర్రాడు అల్లు అరవింద్ గారు. ఆయనను చూసి ఎప్పుడూ ఇన్స్పైర్ అవుతుంటాం.ఈ సక్సెస్ ను శిరీష్ కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఈ పొజిషన్ లో ఉండటానికి శిరీష్ కారణం. సో తన సినిమా ఏదున్నా అది సక్సెస్ చెయ్యడానికే ప్రయత్నిస్తాను. అను ఇమ్మన్యుల్ మా సంస్థ మీద నమ్మకంతో ఈ సినిమా చేసారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నా జీవితంలో ఆయనే ఉన్నారు, నేనే ఆయన, ఆయనే నేను. నన్ను ఎవరైనా ఎంత సంపాదించావు అంటే చాలా సంపాదించాను చెప్తాను, ఎందుకంటే ఆయన సంపాదించింది అంతా నాదే. ఏమి సాధించవు అంటే చాలా సాధించా అని చెప్తా ఎందుకంటే ఆయన సాధిస్తే నేను సాధించినట్టే. థాంక్యూ సో మచ్.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…
ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళిన మీడియాకు ముందుగా కృతజ్ఞతలు. పాన్ స్టార్ గా ఎదిగిన బన్నీ, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శిరీష్ నాకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది.రాకేష్ శశి ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ దర్శకుడు అయ్యాడు. దిల్ రాజ్ గారు నేను విజిల్ వేస్తే వచ్చేస్తారు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker