ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. మృతి
. ఆరుబయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను *ఆనంద్ అనే వ్యక్తి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు* ఉన్నాయి.
అనంతరం బాలిక మృతి చెందడంతో ఆమెను ఇంటి వద్ద కుర్చీలో ఉంచి నిందితుడు పరారైనట్లు సమాచారం.
బాలికను గుర్తించిన అమ్మమ్మ.. బంధువుల సహాయంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తుండగా.. చిన్నారిని అమ్మమ్మ వద్ద ఉంచినట్లు సమాచారం.
*ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇవి ఆరోపణలు మాత్రమే.*




