All

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

మంజీరా నదిలో గజేతగా ళ్ల వెతుకులాట......

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

సూటి పోటీ మాటలు కారణమా…….
కొల్చారం, ప్రయత్నం న్యూస్ ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి.. మంజీరా నదిలో దూకింది. ఈ విషయాన్ని అంతకుముందు తండ్రికి ఆమె ఫోన్‌ చేసి చెప్పింది. విషయం అందుకున్న పోలీసులు,సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈ ఘటన మంగళవారం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ శివారులోని మంజీరా నది మొదటి వంతెన వద్ద జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన సరిత, ఆమె కుమార్తెలు వైష్ణవి, శ్రావణి తప్పిపోయినట్లు ఎల్లారెడ్డిలో ఉన్న తండ్రి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదైంది. సెల్‌ఫోన్‌ సిగ్నళ్లను పోలీసులు పరిశీలించారు. ఏడుపాయల మొదటి వంతెన వద్ద సిగ్నల్‌ చూపించింది. మెదక్‌ రూరల్‌ సీఐ కృష్ణమూర్తి, కొల్చారం ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నది ఒడ్డున ముగ్గురి చెప్పులు, సెల్‌ఫోన్‌ లభించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో రెండు గంటల పాటు గాలించారు. చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం చేపడతామని పోలీసులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సరిత నివసిస్తూ కాపలాదారుగా పనిచేస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. ఆమె ఆధార్‌ కార్డులో సవరణ కోసం మెదక్‌లో ఉంటున్న అక్క వద్దకు వస్తోంది. ఏడుపాయల సమీపంలోని నది ఒడ్డుకు చేరుకున్న ఆమె అందులో దూకుతున్నట్లు తండ్రి బాలకిష్టయ్యకు ముందుగా ఫోన్‌ చేసి చెప్పింది. చిన్నారుల్లో వైష్ణవి ఐదు , శ్రావణి నాలుగు చదువుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker