యువ ఎమ్మెల్యేను చంపేస్తానంటూ బెదిరింపులు…..మంత్రి దామోదర్
ఢిల్లీలో షాకింగ్ ఘటన.. షాంగ్రిలా హోటల్ లాబీలో యువ ఎమ్మెల్యేపై మంత్రి దామోదర్ బూతుల దాడి!
ఢిల్లీలో షాకింగ్ ఘటన.. షాంగ్రిలా హోటల్ లాబీలో యువ ఎమ్మెల్యేపై మంత్రి దామోదర్ బూతుల దాడి!
మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు..
యువ ఎమ్మె
ల్యేను చంపేస్తానంటూ బెదిరింపులు.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక షాంగ్రిలా హోటల్ లాబీలో నిన్నటి ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. మంత్రి దామోదర్ ఓ యువ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, అత్యంత అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
హోటల్ లాబీలో జరిగిన ఈ ఘటనలో మంత్రి దామోదర్.. ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించినట్లు సమాచారం.
“నిన్ను బొందపెడతా.. ఏమనుకుంటున్నావ్ దామోదర్? డీసీసీలు ఇప్పిస్తున్నావట.. నీకు ఎవడికంటే వాడికి ఇప్పిస్తావా? నువ్వేమైనా పెద్ద సుల్తానా అనుకుంటున్నావా? అరగంట రూమ్‌లో వేసి గుద్దపలగ్గొడతా” అంటూ మంత్రి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా.. “You have crossed all the limits” అంటూ మరింత ఆగ్రహంతో హెచ్చరించినట్లు సమాచారం.
డీసీసీ నియామకాలే వివాదానికి కారణమా?
డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో తలెత్తిన విభేదాలే ఈ వివాదానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆధిపత్య పోరు చివరకు ఒక మంత్రి, యువ ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.
ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరో ప్రజాప్రతినిధిపై ఈ స్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రాణహాని కలిగించేలా బెదిరింపులు చేశారన్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీ షాంగ్రిలా హోటల్‌లో అసలేం జరిగింది? డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణాలేమిటి? ఒక మంత్రే మరో ప్రజాప్రతినిధిని బెదిరించే స్థాయికి పరిస్థితులు చేరితే, పార్టీలో క్రమశిక్షణకు అర్థమేమిటి? మంత్రులే బహిరంగంగా ఇలా వ్యవహరిస్తే.. కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి సందేశం వెళ్తుంది? ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందించబోతోంది? బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటన జరిగిన సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లన్న, సాక్షి సీనియర్ జర్నలిస్ట్ రాజశేఖర్ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. షాంగ్రిలా హోటల్‌లో జరిగిన ఈ పరిణామాలకు వీరు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారన్న సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి దామోదర రాజనర్సింహ వర్సెస్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్ రావు మధ్య ఘర్షణ…


