All

పర్చూరు నియోజకవర్గంలో…. ఏలూరి బలం పెరుగుతుందా…..

 అయనా అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుందా......

పర్చూరు నియోజకవర్గంలో…. ఏలూరి బలం పెరుగుతుందా…..
మూడు పర్యాయాలుగా TDPలో ఎమ్మెల్యే…. ఏలూరి
అయనా అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుందా……
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
పర్చూరు నియోజకవర్గ ఈ నియోజకవర్గంలో మొదటిసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మూడుసార్లు ఛాన్స్ ఇచ్చింది అప్పుడు కూడా ఓట్ల పర్సంటేజీ పెరుగుతూ తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం ఏలూరు సాంబశివరావు ఓట్ల పర్సంటేజ్ పెరుగుతూ తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా ఏలూరు సాంబశివరావు నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు అంటే ఆరు జడ్పిటిసిలు అని అర్థం 93 సర్పంచ్ స్థానాలు 81 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి వీటిలో ఈ ఎన్నికల్లో ఏలూరు సాంబశివరావు అంటే కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుంది ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు 2024 ఎన్నికల్లో టిడిపికి 54 పాయింట్ 6 7% ఓట్లు వచ్చాయి వైసిపికి 42.79% ఓట్లు వచ్చాయి ఈ తేడా చూసుకుంటే వైసీపీకి కొన్ని పదవులు వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది . ఆ పదవులు ఏలూరు సాంబశివరావు చేసిన అభివృద్ధి ప్రజలకు నచ్చితే వారు ఓటేసి ఆయనకు మద్దతు పలుకుతారు అలా కాకుండా ప్రజలు వెనకడుగు వేస్తే కొన్ని సీట్లు పక్క పార్టీకి పోయే అవకాశాలున్నాయి ఒకసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్న సమయంలో అంటే 1983 లో 53.29% ఓట్లతో గెలుపొందారు ఆ తర్వాత 1985 ఆకస్మికంగా మల్ల ఎలక్షన్ రావటంతో రెండు సంవత్సరాలకే ఓట్ల శాతం తగ్గింది 49.93% ఓట్లతో రెండోసారి గెలుపొందారు మూడోసారి పరిపూర్ణంగా పాలన చేయడంతో తిరిగి 1989లో 53.25% ఓట్లు వచ్చాయి ఇది ఆయన ట్రాక్ రికార్డు అలాగే ఏలూరు సాంబశివరావు రికార్డును ఒకసారి చూస్తే 2014లో 51.65% ఓట్లు వచ్చాయి 2019లో 47.78% ఓట్లతో గెలుపొందారు 2024లో 54.67 ఓట్లతో గెలుపొందారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏలూరు సాంబశివరావు 47.78% ఓట్లను తీసుకోగలిగారు ఈ ప్రకారం చూస్తే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పడం అంత తేలికేం కాదు ఏలూరు సాంబశివరావును ఎదుర్కోవటం నాయకుల వల్ల కాదు కేవలం ప్రజల వల్లే అవుతుంది అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి శిలాఫలకాల మీద కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా నిర్మాణాలు కనపడలేదు ఆయన పరిపాలనలో ఉన్న సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని జడ్పిటిసిలు గాని ఎంపీపీలు గాని ఎవరు కూడా నియోజకవర్గ అభివృద్ధికి పాట పడినట్టుగా కనిపించలేదు వారి స్వంతనికి మాత్రమే పనిచేసినట్టుగా కనిపించింది ఒక్క ఏలూరు సాంబశివరావు తప్ప మిగిలిన నాయకులంతా కొంతమంది నాయకులు డబ్బులు కాశపడ్డ మరి కొంతమంది నాయకులు అయితే మరోసారి ఎలాగైనా అధికారం సాధించాలని పట్టుదలతో అభివృద్ధి జరగకపోయినా ప్రజల మధ్యలో తిరిగారు మరి ఈ తిరగడం చేయడం అనేది సర్వసాధారణం కాబట్టి ఎన్నికలు అభివృద్ధిని బట్టి ప్రజల నిర్ణయాన్ని బట్టి ప్రజల బాగోవులను బట్టి ఫలితాలు వస్తాయి అనేదానికి ఈరోజు తేలిపోతుందేమో వేచి చూడాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker