భూభారతి….. యు ఎల్ సి 22 వేల పెండింగ్ దరఖాస్తులు…. కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ భూములన్నీ కలెక్టర్ ఆధీనంలోనే ఉన్నాయా....
భూభారతి….. యు ఎల్ సి 22 వేల పెండింగ్ దరఖాస్తులు…. కలెక్టర్ నారాయణ రెడ్డి
ఇతర పెండింగ్ దరఖాస్తులు ఎన్ని ఉండవచ్చు….. జిల్లాలో అన్ని విభాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయా….

హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధీనంలో అన్ని విభాగాల పెండింగ్ దరఖాస్తులు పెండింగ్ వర్కులు అలాగే భూభారతి యు ఎల్ సి సర్వే డిపార్ట్మెంట్ కు సంబంధించినవి ఇతర విభాగాలకు సంబంధించిన దరఖాస్తులు అన్ని కలెక్టర్ పరిధిలో ఉన్నాయా లేక కేవలం భూభారతి యు ఎల్ సి ఈ రెండు విభాగాలకు సంబంధించి మాత్రమే 22వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆయన అధికారులతో చెప్పారు గతవారం జరిగిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్లో మరియు విలేకరుల సమావేశంలో కలెక్టర్ ప్రతి ఒక్క అధికారిని త్వరితగతిన పనిచేసే పెండింగ్ లేకుండా దరఖాస్తులన్నీ త్వరగా తిన పూర్తి కావాలని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆర్డీవో కార్యాలయాల్లో ఎన్ని వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఎన్ని కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి అలాగే మండల కార్యాలయాల్లో ఎన్ని కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఆయా కార్యాలయాల్లో ఉన్న జనన మరణ ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు సుపరిచితమైన అన్నిటినీ ఇన్ వర్డ్ బుక్ లో ఎక్కిస్తున్నారా లేదా గాలికి వదిలేస్తున్నారా ప్రభుత్వ భూములన్నీ కలెక్టర్ ఆధీనంలోనే ఉన్నాయా లేక రియల్ ఎస్టేట్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయా రంగారెడ్డి జిల్లాలో ఉన్న జిహెచ్ఎంసి గాని హెచ్ఎండిఏ గాని వారి పరిధిలో ఉండాల్సిన పార్కులు ఎన్ని ఉన్నాయి? వాటి సంగతేంటి అలాగే ప్రభుత్వ భూములు వాటి ఫెన్సింగ్ మరియు కాపలాదారు వ్యవహారాలన్నీ సరైన పద్ధతిలో ఉన్నాయా? ఇంకా నోటరీ వ్యవస్థ నడుస్తూనే ఉంది పర్మిషన్ లేకుండా బిల్డింగులు కడుతూనే ఉన్నారు ఇష్టం వచ్చినట్టు స్కూళ్ల ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. ఇష్టం వచ్చిన విధంగా బియ్యం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న సౌకర్యాలు కూడా ప్రజలకు భూతాల కనబడుతున్నాయి అంటే అత్యధిక రేట్లు పెరిగి కనీసం పేద ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు కేవలం ఆయన పరిధిలో ఉండే జిల్లా లో ఉన్న సమస్యలు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి కి తెలుసా ఆయనే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి


