
పేషెంట్లు పిల్లలు హార్ట్ పేషెంట్లు కానరారా……
ఒక్కసారి అందరి గురించి ఆలోచించండి….. రేణు దేశాయ్ దీపావళి వేడుకల పేరుతో అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై నటి రేణూదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏమైనా మాట్లాడితే హిందూ వ్యతిరేకి అని అంటారని అందుకే మౌనంగా ఉన్నానని అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇబ్బందులను గుర్తించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
‘‘రాత్రి 11 గంటలవుతోంది. అయినా ప్రజలు ఇంకా ఇంత పెద్ద శబ్దం వచ్చే టపాసులు కాలుస్తూనే ఉన్నారు. దీపావళి రోజు ఏదైనా మాట్లాడి ఉంటే నన్ను హిందూ వ్యతిరేకి అనేవారు. అందుకే ఆరోజు మౌనంగా ఉండిపోయాను. కానీ దీపావళి అయిపోయినా కూడా 11 గంటలకు ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు కాల్చడానికి ఏ పండుగ ఉంది?. ఇతరుల బాధలను పట్టించుకోకుండా మన ఆనందమే ముఖ్యమనుకుంటున్నారు. ఇది కేవలం మూర్ఖత్వం, ఎదుటివారి పట్ల కనీస సానుభూతి లేకపోవడమే’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



