All

కర్నాల్ పల్లి గ్రామంలో లో ఎల్ నినో గ్రామసభ నిర్వహణ

గ్రామసభకు గ్రామ సర్పంచ్ దుర్గాదేవి అధ్యక్షత వహించారు

కర్నాల్ పల్లి గ్రామంలో లో ఎల్ నినో గ్రామసభ నిర్వహణ

చేగుంట: నవంబర్ 12 ప్రయత్నం న్యూస్

చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామపంచాయతీలో ఎల్ నినో గ్రామసభ నిర్వహించారు. ఈ . ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, తాగునీటి ఎద్దడి నివారణ, నీటి సంరక్షణ, వ్యవసాయంపై ప్రభావం తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఏపీఓ శ్వేత మాట్లాడుతూ ఇంకుడు గుంతలు తప్పకుండా నిర్మించుకో వాలని వాటి గురించి వివరించారు. ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు మంజూరు చేయబడినది తెలియజేశారు. జాబ్ కార్డు లేని వారు గ్రామపంచాయతీలో దరఖాస్తు చేయగలరని ఎంపీడీవో గారు తెలియజేశారు. ఉపాధి హామీ ద్వారా లబ్ధిదారులకు పనులు చాలా ఉన్నాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏపీవో శ్వేత, ఎంపీవో ప్రకాష్, వ్యవసాయ అధికారి హరిప్రసాద్, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, పంచాయతీ కార్యదర్శి పుష్పలత, గ్రామ సర్పంచ్ దుర్గాదేవి, ఉప సర్పంచ్ శివకుమార్, మరియు పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘ మహిళలు, గ్రామస్తులు మరియుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker