: ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు
చేగుంట నవంబర్ 12 ప్రయత్నం న్యూస్
* చేగుంట మండల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కెరీర్ గైడెన్స్ అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సైకాలజిస్ట్, మాజీ డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం కాదని, విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాలలో రాణించినప్పుడు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని అన్నారు. కష్టాన్ని ఇష్టంతో చదివినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని, గొప్ప గొప్ప వ్యక్తులంతా కింద స్థాయి నుంచి ఎదిగిన వారేనని తెలిపారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడతారని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండల విద్యాధికారి టీ నీరజ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు రఘుపతి, సుధాకర్ రెడ్డి, రాధ, రమ, రమాదేవి, చల్లా లక్ష్మణ్, రావుల వెంకటేష్, గర్దాస్ మనోహర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సరస్వతి, శ్రీవాణి, ఉమా, ఉమామహేశ్వరి, సీఆర్పీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


