All

కామారెడ్డిలో హోరెత్తిన విద్యార్థుల గళం! రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్!

ఈ మహా ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) మరియు TNSF పాల్గొన్నారు.

ఈరోజు శుక్రవారం నాడు కామారెడ్డిలో హోరెత్తిన విద్యార్థుల గళం! రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్!
రూ. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో 5,000 మంది విద్యార్థులతో 5 కి.మీ. భారీ ర్యాలీ.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పేద విద్యార్థుల ఉసురు తీసుకుంటున్న ఫీజు బకాయిల సమస్యపై  ఆధ్వర్యంలో శుక్రవారం ఒక మహా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుమారు 5,000 మంది విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కామారెడ్డి వీధుల్లో 5 కిలోమీటర్ల మేರೆకి భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మరియు TNSF రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర హాజరై ర్యాలీని విజయవంతంగా నడిపించారు. వీరితో పాటు TNSF వైస్ ప్రెసిడెంట్ బాలు, నాయకులు గణేష్, చౌహాన్, టీడీపీ నాయకులు రాజు మరియు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో గత కొంతకాలంగా పేరుకుపోయిన రూ. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు మెస్ చార్జీల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీల యాజమాన్యాల వేధింపులతో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసే దుస్థితి వచ్చిందని, సర్టిఫికెట్లు రాక ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పెండింగ్ బకాయిలన్నింటినీ తక్షణమే జమ చేయాలని, లేనియెడల విద్యార్థులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker