All
ఇందిరమ్మ జీవిత బీమాపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
ఇందిరమ్మ జీవిత బీమాపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
చేగుంట నవంబర్ 19 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చిన్నారెడ్డి పథకానికి సంబంధించిన వివరాలు, అమలు విధానం, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు వివరించారు. గ్రామస్థాయిలో అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం చేరవేయడంతో పాటు, పథకం అమలులో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ప్రజలకు పథకం వివరాలు చేరవేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి సూచించారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీవో ప్రకాష్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




