Allసినిమాలు

వ‌చ్చే ఏడాది జనవరి 8కి ఆర్ ఆర్ ఆర్ విడుదల

యంగ్ టైగర్ యన్ టీ ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా  ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డి వి వి దానయ్య నిర్మిస్తున్న మాగ్నమ్ ఓపస్ ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీని ఈ ఏడాది జూన్ నుంచి వ‌చ్చే ఏడాది  జనవరి 8కి మార్చిన విష‌యం విదిత‌మే. 

కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్ర  ప్రదర్శన హక్కుల కోసం పంపిణీదారుల‌లో పోటీ జ‌రుగుతోంది. తాజాగా  ఈ చిత్రానికి సంబంధించి నైజాం  ఏరియా హ‌క్కుల‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకున్నట్టు ఫిలింన‌గ‌ర్‌లో ఓ టాక్ న‌డుస్తోంది. ఈ సంక్రాంతికి విడుద‌లైన రెండు చిత్రాలు దిల్‌రాజ్ విడుద‌ల చేసి భారీ లాభాలు ఆర్జించార‌ని, అదే స్తాయిలో ప్రేక్ష‌కుల‌కు అంద‌నున్న ఈ డ‌బ‌ల్‌ఢ‌మాకా సినిమా దిల్‌రాజుకు లాభాలు పంట పండించ‌డం ఖాయ‌మంటున్నారు సినీ జ‌నాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker