All
ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ..!
బహిరంగంగానే నగదు పంపకాలు.. పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు ఎక్కడ..?
ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ..!

నగదు పంపిణీకి సంబంధించిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో కలకలం రేగుతోంది. ఎన్నికల వేళ ఇంత బహిరంగంగా డబ్బుల పంపిణీ జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
అధికారుల కనుసన్నల్లోనే ఈ తంతు సాగుతోందా? అన్న అనుమానాలను కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను అమలు చేయాల్సిన యంత్రాంగం ఈ వ్యవహారాన్ని గమనిస్తోందా? నగదు పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వీడియోలో కనిపిస్తున్న ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.



