Allసినిమాలు

వారిద్ద‌రి మ‌ధ్య వార్ మొద‌లైందిగా…?


టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా స‌రే త‌న కో స్టార్స్‌తో బాగానే ఉంటారు. ఎప్పుడు క‌లిసినా ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం. ప్రేమ‌లు, అభిమానాలు ఇవ‌న్నీ కామ‌న్‌. అంతేకాక వాళ్ళు తీరిక స‌మ‌యాల్లో క‌లిసి హాలీడేట్రిప్స్ కూడా వేస్తుంటారు.  ఒకరి ఫంక్షన్ లకు ఒకరు అటెండ్ అవుతుంటారు. ఇలా ఎన్ని చేస్తున్నా కూడా ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగట్లేదు. డైరెక్ట్ గా స్టేజ్ మీదే మేము మేము బానే ఉంటాం, మీరు కూడా బాగుండాలి అని స్టార్ హీరోలు చెబుతున్నారంటే ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. మాములు హీరోల మధ్య ఫ్యాన్స్ వార్స్ ఉంటే ఏమో అనుకోవచ్చు కానీ ఒకే ఇంట్లో ఉన్న అన్న‌ద‌మ్ములు, మామఅల్లుడ్లు అయిన హీరోల ఫ్యాన్స్ మధ్యన కూడా ఇలాంటి ఫ్యాన్స్ వార్స్ ఉండడం విచిత్రమే.

అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్.. వీరిద్ద‌రు చుట్టాల‌న్న విష‌యం తెలిసిందే.  వరసకు నాగార్జునకు వెంకటేష్ బావ మరిది అవుతాడు. అయితే నాగార్జున తన మొదటి భార్య నుండి విడిపోయి విడాకులు తీసుకున్నాడు. రెండు వైపులా ఫ్యామిలీస్ ఈ విషయంలో ఇద్దరికీ అండగా నిలబడ్డాయి. ఇలాంటి ఒక సంఘటన జరిగినా వెంకటేష్, నాగార్జున ఎప్పుడూ క్లోజ్ గానే ఉన్నారు. బయట ఫంక్షన్స్ లో కూడా సౌకర్యంగానే కలుస్తారు. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం పరిస్థితి అలా లేదు. అక్కినేని ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ మధ్య క‌నిపించ‌కుండా కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉంది.

అక్కినేని నాగ చైతన్య తన మావయ్య అయిన దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి వెంకీ మామ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమాకు కట్టిన బ్యానర్స్ ఒకసారి పరిశీలిస్తే ఈ రెండు ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్యన కోల్డ్ వార్ అర్ధమవుతుంది. నాగ చైతన్యకు బ్యానర్ లో నాగార్జున మరియు ఇతర అక్కినేని హీరోలు ఉంటున్నారు కానీ వెంకటేష్ కు స్థానం ఇవ్వట్లేదు. అలాగే వెంకటేష్ ఉన్న బ్యానర్ లో రానా ఉన్నాడు కానీ నాగ చైతన్యకు స్థానం లేదు. సిటీల్లో ఇది తక్కువే ఉన్నా ఊర్లలో ఇంకా ఈ ఫీలింగ్ ఎక్కువే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker