Allమూవీ రివ్యూసినిమాలు

వ‌ర్మ‌కు షాక్ మీద షాక్‌


వివాదాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ట్రెండింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌లె ఆయ‌న తెర‌కెక్కించిన `అమ్మ రాజ్యంలో క‌ప‌డ బిడ్డ‌లు` చిత్రం సెన్సార్ ఇబ్బందులు వ‌చ్చి విడుద‌కాలేని విష‌యం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే  తాజాగా వర్మ నిర్మాణంలో తెరకెక్కిన మరో సినిమా ఇదే సెన్సార్ కారణంగా వాయిదా పడింది.

రామ్‌ గోపాల్ వర్మ నిర్మాతగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఫేం అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్యూటిఫుల్‌. బోల్డ్‌ కంటెంట్‌తో రంగీలా తరహాలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ చివరి నిమిషం వరకు కొనసాగింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు సినిమా వాయిదా వేస్తున్నట్టుగా ముందే చెప్పాడు వర్మ. కానీ బుధవారం సాయంత్రానికి బ్యూటిఫుల్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చారు కమిటీ సభ్యులు. కానీ అప్పటికే వర్మ సినిమా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించటంతో బ్యూటిఫుల్‌ శుక్రవారం (06-12-2019) విడుదల కావటం లేదు.

ఇప్పటికే సెన్సార్ సమస్యల్లో ఉన్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పరిస్థితి కూడా ఎటూ తేలటం లేదు. ఇప్పటికే ఈ సినిమాకు 90కి పైగా కట్స్‌ సూచించిన సెన్సార్‌ కమిటీ రివైంజింగ్‌ కమిటీకి సినిమాను చూపించాల్సిందిగా కోరారు. వర్మ కూడా సినిమా విషయంలో లీగల్‌ ఫైట్‌కు రెడీ అవుతున్నట్టుగా స‌మాచారం. ఈ సినిమాకు రాజకీయ వర్గాల నుంచి కూడా అడ్డంకులు ఎదురవుతుండటంతో అసలు విడుద‌ల‌వుతుందా లేదా..? అన్న అనుమానాలు ప్రేక్ష‌కుల్లో ఎక్కువ‌య్యాయి.
వర్మకి ఈ వివాదాలు కొత్తేం కాదు

ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే రామ్‌ గోపాల్‌ వర్మకు ఈ సమస్యలు కొత్తేం కాదు. గతంలోనూ వర్మ సినిమాలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయకుండా కొన్ని రోజులు ఆపారు. ఎల‌క్ష‌న్ అయిన త‌ర్వాత విడుద‌ల చేశారు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న సినిమా టైటిల్స్ మార్చి అందులోని కొన్ని డైలాగులు, స‌న్నివేశాలు మార్చాలిసొస్తుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker