Allసినిమాలు

మామయ్య సినిమాలో అల్లుడి ప్ర‌తాపం

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంగ్ షెడ్యూల్ లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను మరియు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రబృందం. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో బన్నీ కూడా నటించనున్నట్లు తాజా సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నటిస్తే.. సినిమా పై ఇంకా అంచనాలు పెరుగుతాయి. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.

భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker