ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు

ఫ్రీ లాంచ్ పేరుతో చీటింగ్..ప్రజలను జలగల్లా పీడిస్తున్న రియాల్టర్లు

 సాహితీ తోటి మరికొన్ని సంస్థలు ఎగబడుతున్నాయి
 ఫ్రీ లాంచ్ పేరుతో కేవలం కంప్యూటర్ల మాయాజాలం కలర్ పేపర్ల తో డిజైన్లు గీసి ప్రతి ఒక్కరికి అందజేసి సగానికి సగం ధర అని మాయ మాటలు చెప్పి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అన్న చిరుద్యోగులకు పంగనామాలు పెడుతున్నారు చదువులో ప్రతిభను చాటి కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు సంపాదించి హైదరాబాద్ చుట్టుపక్కల సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలన్న తపనతో ముందు వెనక ఆలోచించకుండా ఫ్రీ లాంచ్ అనగానే లోన్లు పెట్టి అప్పులు తెచ్చి డబ్బులు ఒకేసారి కట్టేస్తూ రియేల్టర్ల జేబులు నింపి ఆ తరువాత కన్నీరు మున్నీరవుతూ రోడ్డు పాలవుతున్న ఎంతోమంది ప్రజలు హైదరాబాదులో జరుగుతున్న ఫ్రీ లాంచ్ మోసాలకు బలిపశువులవుతున్నారు స్థలం ఉండదు డబ్బులు ఉండవు కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని కష్టమర్ ని ఆఫీస్ చూపించి నమ్మకం కలిగించి దోచేస్తున్నారు దోచుకున్న తర్వాత మోసపోయాను అని తెలిసేసరికి రియాల్టర్లు దేశాలు దాటి పోతున్నారు ఇటీవల సాహితీ ఇన్ఫ్రా పేరుతో దాదాపు 1500 కోట్లు వసూలు చేసి ఇప్పుడు సిసిఎస్ పోలీసుల ఎదుట చేతులు కట్టుకొని నుంచునే పరిస్థితి ఒక రిజల్ట్ ఎమ్మార్వోలు రిటైర్డ్ ఆర్డీవోలు రిటైర్డ్ ఇంజనీర్లు కొంతమంది పత్రికా విలేకరులను పిఆర్వోలుగా పెట్టుకొని ఆపద వస్తే ఏ విధంగా బయటపడాలి అని ఆలోచన చేసి మరి ప్రజలను దోచేస్తున్నారు ఇలాంటివారిని హైదరాబాదులో వందల సంఖ్యలో పించవచ్చు కానీ ఎక్కడ కూడా పోలీసులు గాని ప్రభుత్వం గాని తక్షణమే స్పందించదు ఎందుకో చేసే తప్పులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండే వ్యక్తులు కాబట్టి ప్రభుత్వ స్పందించు అలాగే ప్రభుత్వం పోలీసులను తన అదుపు ఆజ్ఞలలో పెట్టుకుని వారు చెప్పినప్పుడే పని చేయాలి అనే విధంగా తయారు చేసుకుని చట్టాన్ని చేతిలో కీలుబొమ్మగా చేసుకుని ఆట ఆడుకుంటుంది ప్రభుత్వం ఇలా అయితే సమాజంలో ప్రతి ఒక్కరూ ఇంకొకరిని దోచుకోవాలని చూస్తారు వారిని ఎలా ఆపుతారు పోయింది నా డబ్బులు కాదు కదా అని గాలికి వదిలేస్తే ఎలా ఫ్రీగా ఏదీ రాదు ఫ్రీ లాంచ్ అనగానే సగం వరకు వస్తుంది కదా అనుకోవచ్చు కానీ ప్రతి వస్తువు రేటు పెరిగిపోయాయి ఇప్పుడు ఫ్రీ లాంచ్ అంటే ఎలా నమ్ముతున్నారు దీనిపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలి సాహితీలాంటివారు వందల సంఖ్యలో ఉన్నారు అందర్నీ గుర్తించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker