. గత నాలుగు నెలల క్రితం వరకు కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య ఉన్న సన్న బియ్యం ధరలు ప్రస్తుతం రూ.65 నుంచి రూ.83 వరకు చేరాయి. తక్కువ నాణ్యత కలిగిన సన్న బియ్యం ధరలు సైతం కిలో రూ.60 దాటడంతో వినియోగదారులపై ఆర్థిక భారం పెరుగుతోంది. నూకల ధరలు కూడా కిలో రూ.20 నుంచి రూ.30కి పెరిగాయి.
నాలుగు నెలల్లో 25 శాతం పెరుగుదల
మార్కెట్లో ప్రముఖ బియ్యం రకాల ధరలు గణనీయంగా పెరిగాయి. 25 కిలోల బస్తాల ధరల ఆధారంగా కిలోకు నమోదైన సగటు ధరలు ఇలా ఉన్నాయి.
* జేఎస్ఆర్ ప్రీమియం కోలం – రూ.83.50
* జేఎస్ఆర్ రా రైస్ – రూ.74.85
* లలిత సోనా మసూరి – రూ.71.33
* కర్నూలు సోనా మసూరి – రూ.70
* హెచ్ఎంటీ రా రైస్ – రూ.69
రిటైల్ దుకాణాల్లో హెచ్ఎంటీ రా రైస్ కిలో ధర రూ.78 వరకు పలుకుతోంది. పక్షం రోజుల క్రితం ఇదే రకం బియ్యం ధర రూ.70గా ఉండటం గమనార్హం.


