మేధావుల మౌనం.. దుర్మార్గుల దౌర్జన్యం కంటే ప్రమాదకరం!”
రేవంత్, మోదీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పట్టభద్రులు ఓటుతోనే తిరగబడాలి
మేధావుల మౌనం.. దుర్మార్గుల దౌర్జన్యం కంటే ప్రమాదకరం!”
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
* గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్రోల్మెంట్కు మరో 7 రోజులే గడువు: రికార్డు స్థాయిలో నమోదు కావాలని పిలుపు
* కేటీఆర్ గారి ఆదేశాలతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రతి వార్డు, బూత్ స్థాయిలో BRS ‘కియోస్క్’ (Kiosk) కేంద్రాలు

హైదరాబాద్: “సమాజంలో మేధావుల మౌనం అనేది దుర్మార్గుల దౌర్జన్యం కంటే అత్యంత ప్రమాదకరమైనది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పట్టభద్రులు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ఓటు హక్కును ఆయుధంగా మలచుకోవాలి” అని BRS పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.
1) కేటీఆర్ గారి నేతృత్వంలో సమరశంఖం – వేగవంతంగా ఓటర్ల నమోదు:
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ మరియు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉభయ MLC గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కే.టి. రామారావు (KTR) గారి ఆదేశాల మేరకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.
రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్లు ఉండగా, ఇంకా అనేకమంది ఎన్రోల్ కాకపోవడంపై కేటీఆర్ గారు నిరంతరం టెలీ కాన్ఫరెన్సుల ద్వారా ప్రజాప్రతినిధులను, నేతలను తట్టిలేపుతున్నారు.
నవంబర్ 6 తో గడువు ముగియనున్నందున (కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది), ఈ ఏడు రోజుల్లో రికార్డు బద్దలు కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.



