ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారుల చర్యలు నామమాత్రమేనా?
కేసులు లేకుండానే వాహనాలు, యంత్రాలు వదిలేస్తున్నారా?
ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారుల చర్యలు నామమా
త్రమేనా?
లారీ పట్టివేత.. ఎక్స్‌కవేటర్ స్వాధీనం.. ఆపై విడుదల!
కేసులు లేకుండానే వాహనాలు, యంత్రాలు వదిలేస్తున్నారా?
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 114/1లో ఇసుక తవ్వకాలు, రవాణా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అక్టోబర్ 30వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఇసుక తరలిస్తున్న లారీని రెవెన్యూ అధికారులు పట్టుకుని చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అయితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం.
మరోవైపు ఇసుక తవ్వకాలకు ఉపయోగిస్తున్న ఎక్స్‌కవేటర్‌ను కూడా అధికారులు పట్టుకున్నప్పటికీ అనంతరం వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అక్టోబర్ 31వ తేదీ ఉదయం మోటుపల్లి సమీపంలో భారీ ఎక్స్‌కవేటర్‌ను ట్రాలీపై తరలిస్తున్న దృశ్యాలు GPS ఆధారాలతో కూడిన ఫొటోలలో నమోదయ్యాయి.
అధికారుల చర్యలపై అనేక ప్రశ్నలు!
లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కేసు ఎందుకు నమోదు కాలేదు? ఎక్స్‌కవేటర్‌ను పట్టుకున్న తర్వాత ఎందుకు విడుదల చేశారు? తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎందుకు సమగ్ర విచారణ చేపట్టడం లేదు?
కలెక్టర్, మైనింగ్ అధికారుల జోక్యం అవసరం
సర్వే నంబర్ 114/1లో జరిగిన ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, పట్టుబడిన లారీ, ఎక్స్‌కవేటర్ వివరాలను పరిశీలించాలని, అనుమతులు లేకుండా తవ్వకాలు లేదా రవాణా జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని చెప్పే అధికారులు.. పట్టుబడిన వాహనాలు, యంత్రాల విషయంలో తీసుకుంటున్న చర్యలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

