బేతుపల్లి చెరువులో పెను ప్రమాదం: 11 మంది కానిస్టేబుళ్లు గల్లంతు*
నీటి ప్రవాహానికి రెండు SDRF బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయి
ఎస్డీఆర్ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆరా తీశారు. నీటి ప్రవాహానికి రెండు SDRF బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయి బేతుపల్లి చెరువులో పెను ప్రమాదం: 11 మంది కానిస్టేబుళ్లు గల్లంతు*
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుళ్లు ప్రమాదానికి గురయ్యారు.
– బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్యకారులను కాపాడే క్రమంలో ఈ ఘటన జరిగింది.
– బలమైన గాలి, నీటి ప్రవాహానికి రెండు SDRF బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయి.
– గల్లంతైన 11
మంది కానిస్టేబుళ్ల కోసం గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.
ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఘటనాస్థలి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది.


