పినపాక నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు
విప్పలసింగారంలో లబ్ధిదారు నివాసంలో వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
పినపాక నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు
*

* కరకగూడెం, సమితిసింగారంలో లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు
మణుగూరు/కరకగూడెం, నవంబర్ 8, ప్రయత్నం న్యూస్:
పినపాక నియోజకవర్గవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు” ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. మణుగూరు, కరకగూడెం మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మణుగూరు మండలం విప్పలసింగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు ఈసం రజిత నివాసంలో నిర్వహించిన వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రజిత కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దీపాలు వెలిగించి, దీపావళి సంబరాల్లో పాల్గొని లబ్ధిదారులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారమవుతుండటం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు. పేదల ఇళ్లలో నిరంతరం సంతోషాల వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
*కరకగూడెం, సమితిసింగారంలో ఆనందోత్సాహాలు:
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సర్పంచ్ పోలేబోయిన సుజాత కరకగూడెం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
అలాగే, మణుగూరు మండలం సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మణుగూరు కాంగ్రెస్ మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, విప్పలసింగారం సర్పంచ్ పాల్వంచ రాములు, ఉప సర్పంచ్ గోరంట్ల కనకయ్య, వార్డు సభ్యులు నరేష్, మానస, నాయకులు ఎండి యాకూబ్ అలీ, పద్మాల సత్యనారాయణ, మహిళా కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


