All
చేగుంట పట్టణ కేంద్రంలో నాగులమ్మ దేవాలయం వద్ద నాగల చవితి వేడుకలు
నాగులమ్మ దేవాలయం వద్ద ఆలయ ధర్మకర్త మ్యాకల జయరాములు వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నాగుల చవితి వేడుకలు జరిపారు
చేగుంట పట్టణ కేంద్రంలో నాగులమ్మ దేవాలయం వద్ద నాగల చవితి వేడుకలు చేగుంట నవంబర్ 13 ప్రయత్నం న్యూస్ చేగుంట మండల కేంద్రంలో
దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండగ నాగుల చవితి నాగుల చవితి రోజు ఉదయాన్నే లేచి పిల్లలు పెద్దలు అందరూ నాగులమ్మ దేవాలయం వద్ద పుట్టలో పాలు పోసి పూజలు చేశారు ఈ మాసం కార్తీక మాసం కావున శివకేశవులకే కాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకుంటారు అందుకే ఈ మాసం పేరు కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి రోజున సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ఈరోజును నాగుల చవితి మహా చతుర్థి అంటారని ఆలయ ధర్మకర్త జయ రాములు తెలిపారు




