సింగనపల్లిలో మానవత్వం చాటిన స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జగదీశ్వరి.
పోలవరం,(ప్రయత్నం విలేకరి) : సింగనపల్లి గ్రామాని

కి చెందిన కొవ్వాసు సౌందర్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మానవత్వంతో స్పందించారు.ఆమె చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించి, బాధితురాలిని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అండగా ఉంటామని భరోసాఇచ్చారు.ఈ కార్యక్రమంలో వింజరం ఎంపీటీసీ కొక్కెర రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు మడకం లక్ష్మి, మడకం బుచ్చిరాజు, కొవ్వాసు శీను, బొరగం బైరస్వామి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజా సేవ అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ప్రజా సేవే లక్ష్యం – ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే మా బాధ్యత.



