విద్యార్థుల్లో విజ్ఞానం, సృజనాత్మకత, దేశభక్తి పెంపొందించాలి – డా,, పెండెం కృష్ణ కుమార్
నాలుగు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన ప్రముఖ కళాకారుడు, రచయిత, పర్యావరణవేత్త, సామాజిక సేవకుడు డా. పెండెం కృష్ణ కుమార్
విద్యార్థుల్లో విజ్ఞానం, సృజనాత్మకత, దేశభక్తి పెంపొందించాలి – డా,, పెండెం కృష్ణ కుమార్
చేగుంట నవంబర్ 18 ప్రయత్నం న్యూస్
సూర్యాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)కు తన స్వంత నిధులతో జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖుల చిత్రపటాలు, సరస్వతీ దేవి, స్వామి వివేకానంద, బాబు రాజేంద్రప్రసాద్, జవహర్లాల్ నెహ్రు, ఆజాద్ చంద్రశేఖర్, మహాత్మ జ్యోతిరావు పూలే, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఏ పేజీ అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్ వంటి చిత్రపటాలు , మెడికల్ కిట్, భారతదేశం, తెలంగాణ, ప్రపంచ పటాలు, పర్యావరణ పరిరక్షణ కోసం క్లాత్ బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా డా. పెండెం కృష్ణ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలంటే స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, వారి సేవలు, విజయాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు. చదువుతో పాటు క్రీడలు, ఆరోగ్యం, సామాజిక బాధ్యతలకు కూడా విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రతి విద్యార్థి ఇష్టంతో విజ్ఞానాన్ని అభ్యసించి, ఉన్నత స్థానాలకు ఎదిగి, దేశ భవిష్యత్తులో భాగస్వాములై ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి చేతి సంచులను ఉపయోగించాలని, నీటిని పొదుపుగా వాడాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గోలి పద్మ మాట్లాడుతూ… నాలుగు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన డా. పెండెం కృష్ణ కుమార్ తమ పాఠశాలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు పాఠశాలకు అవసరమైన సామగ్రిని తన స్వంత నిధులతో అందించడం ఎంతో సంతోషకరమన్నారు. గత 34 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో సుమారు 40 నిమిషాల పాటు ప్రత్యేక సమావేశం పొందిన విశిష్ట వ్యక్తి తమ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఉపయోగపడే సామగ్రిని అందించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృష్ణ కుమార్ గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పురస్కారాలు పొందాలని, దేశ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గోలి పద్మతో పాటు ఉపాధ్యాయులు బట్టు సునీత, ఆలేటి సుమతి, కోణం అరుణ భారతి, దేవులపల్లి మంజుల, అరుణకుమారి, కోన వెంకటేశ్వర్లు, కర్నాటి శ్రీనివాస్, కే. పుష్పలీల, జి. మధుసూదన్ రెడ్డి, శ్రీరంగం ఉమ, బి. రమణకుమారి, కడారి నిర్మల, అబ్దుల్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


