సోపిరాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి…..
టి ఎస్ ఆర్ నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి మన యూనిటీ ని సాటుకోవాలి....
సోపిరాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి…..
మన గ్రామం అభివృద్ధి చెందాలి అంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి….
టి ఎస్ ఆర్ నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి మన యూనిటీ ని సాటుకోవాలి….
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
40 సంవత్సరాల క్రితం చిన్నగంజాం మండలంలో సోపిరాల ఒక చిన్న గ్రామం అది కూడా రెవిన్యూ గ్రామం మనకు ప్రత్యేక గ్రామం రాదు లేదు కాబట్టి మనం చిన్నగంజాం గ్రామంలోనే ఉండిపోవాలి అలాగే మన చిన్నగంజాం మరియు సోపిరాల ఈ రెండు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కాంక్షించే మనుషులకు ఓట్లు వేయాలి గత 15 సంవత్సరాలుగా మనల్ని పరిపాలిస్తున్న పాలకులు అంతకు ముందు పరిపాలించిన పాలకులు కేవలం మన ఊరి రోడ్ల పరిస్థితిని మాత్రమే కొంతవరకు మార్చారు ఆ రోడ్లు కూడా డబ్బుల కోసం వేసిన రోడ్లు కదా ప్రజలు నడవడానికి కానీ వాహనాలు వెళ్లడానికి కానీ పనికిరావు గత పాలకులు కేవలం డబ్బు ఆశకు లేక ఉండ పండు వెనక్కి పోతుందని భయంతోనూ ఇంజనీరింగ్ మరియు ఎవరు సపోర్ట్ లు లేకుండా పాలకులు మాత్రమే రోడ్లు వేశారు అభివృద్ధికి ఎమ్మెల్యే ఇచ్చిన పథకాలు ఎక్కడ కూడా ముందుకు పోనివ్వలేదు అది కూడా శోభిరాల గ్రామంలో ఒక్కసారి మీరు ఆలోచిస్తే 40 సంవత్సరాల క్రితం మనకున్న మామూలు మట్టి రోడ్లు ఇప్పుడు సిసి రోడ్లుగా మారాయి అంతే తప్ప ఎటువంటి డెవలప్మెంట్ లేదు శిఖరం రాంబాబు ఉప సర్పంచ్ గా ఉన్న సమయంలో సోపిరాల్లో డ్రైనేజ్ వ్యవస్థను మంచినీటి వ్యవస్థను బాగు చేసే విధంగా ప్రయత్నం చేశారు కానీ ముందుకు పోనివ్వలేదు పై అధికారులు గానీ పెద్ద రాజకీయ నేతలు గాని మన గ్రామం అభివృద్ధికి ఎవరు తోడ్పడలేదు మనకి ఆరు నెలల క్రితమే ఒక మంచినీటి ట్యాంకు సాంక్షన్ అయ్యింది దానిని నిర్మించడానికి అధికారులు ముందుకు రాలేదు పెద్ద రాజకీయ నేతలు ముందుకు రాలేదు . మన అందుబాటులో ఉన్న నేతలు కూడా ముందుకు రాలేదు కేవలం టి ఎస్ ఆర్ ఆంజనేయులు మాత్రమే కుర్రి రామ సుబ్బారావు మరియు జై రావు ఇంకొక నలుగురు ఐదుగురుతో కలిసి ఆ ట్యాంక్ ఉన్న పరిస్థితిని కట్టాల్సిన దాని పరిస్థితి గురించి ఆలోచించారు గ్రామంలో మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి అవేంటంటే చిన్నగంజాం చుట్టుపక్కల ఉన్న చేపల చెరువులో రొయ్యలు చెరువులు ఉండటం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోవడమే కాకుండా కలుషితం అయిపోయింది ఇప్పుడు మనకున్న చెరువుల్లో గాని సోనల్లో గాని మంచినీళ్లు తాగే పరిస్థితి లేదు . ఎందువలనంటే అంతా కలుషితమైపోయింది ఈ కలుషితం కాకుండా ఊరి వారికి కాపాడ్డానికి ప్రభుత్వం కూడా ఒక మంచి పని చేసింది మన ఊరు చుట్టుపక్కల కరెంటు కాలువ అనే ఒక కొత్త కాలువను ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసింది అది ప్రారంభ దశలోనే మన నాయకులు అడ్డుకున్నారు అధికారులు ముందుకు రాలేదు . అది అలానే ఉండిపోయింది ఇసుక దిబ్బలు కరిగిపోయాయి సోనలు మాయమైపోయాయి సోపిరాల్లో కాపులు కాకుండా గొల్ల వారు కాకుండా మరికొంతమంది వివిధ రకాల కులాల వారు వచ్చి చేరుతున్నారు . అదే వ్యవస్థను ముందుకు సాగిద్దామని కొంతమంది నేతలు గేటు అవతలకి పోయి రాజకీయం చేస్తున్నారు మన ఊర్లో ఉండి మనకు రాజకీయం చేసి మన ఊరిని బాగు చేయమని అడిగితే ఓరు బయటికి వెళ్లి రాజకీయం చేస్తున్న నేతలు మరి ఎందుకు చేస్తున్నారు అంత అవసరం ఏమి వచ్చింది అనేది ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సిన విషయమే ప్రజలందరూ చూస్తున్నారు కానీ మాట్లాడటం లేదు మాట్లాడే సమయం రాకముందే ఓట్ల సమయం వచ్చింది కాబట్టి ఓట్లతో సమాధానం చెప్పే తరుణం అందరికీ ముందల ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ టి ఎస్ ఆర్ ఏమి చెబుతున్నారో దానిని ఆలోచించి ప్రతి ఒక్కరూ ముందుకు పోతే ఊరికి మేలు జరుగుతుంది అనేది కొంతమంది సోపిరాల నాయకుల ఆలోచన… ప్రతి ఒక్కరు ఆలోచనను గౌరవించి 100% ఓటింగ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలి



