All

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.

ఇరాన్‌ సైతం చర్చలు.. 

 అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్‌తో చర్చలు విఫలమైతే మరోసారి సైనిక దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అవసరమైతే కేవలం గంటలో 38 వంతెనలను ధ్వంసం చేయగలమంటూ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇప్పటికే మూడు విమాన వాహక యుద్ధనౌకలను రంగంలోకి దించినట్లు ప్రకటించారు. ఒకవైపు అణు ఒప్పందం కోసం చర్చలు జరుపుతూనే.. మరోవైపు యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్న అమెరికా వైఖరితో మధ్యప్రాచ్యంలో మరోసారి ఆందోళన మొదలైంది. ఇరాన్‌ అమెరికా షరతులకు అంగీకరిస్తుందా? లేక మరోసారి యుద్ధం తప్పదా? అన్న ఉత్కంఠ నెలకొంది.  ఇరాన్‌ సైతం చర్చలు.. 
ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌, పాకిస్థాన్‌, కువైట్‌, జోర్డాన్‌, టర్కీ, సైప్రస్‌, ఖతార్‌ దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు ప్రాధాన్యత పెరిగినట్లు సూచిస్తున్నాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశించలేమని స్పష్టం చేశారు. ఇరాన్‌ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయని, చర్చల్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పురోగతి లేదని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker